తెలుగు సూక్తులు

నమస్కారం మిత్రులారా ,
              సూక్తులు జీవన సత్యాలను పొందికగా పేర్చబడిన ముత్యాల దండ.
              ముత్యాల దండలో ప్రతి ముత్యానికి ఎంత విలువ వుంటుందో అలాగే
              ప్రతి సూక్తికి అంతే విలువ వుంటుంది.
మొదటగా నాకు నచ్చిన సూక్తి ని ఇక్కడ ఇస్తున్నాను.

1. ఆశావాది ప్రతి ప్రతికూలత లోను అవకాశాన్ని చూస్తాడు
   నిరాశావాది ప్రతి అవకాశం లోను ప్రతికులతను చూస్తాడు.
2. సోమరికి అడవిలో కలప కూడా దొరకదు.
3. మన అనుమతి లేకుండా మనలని ఎవరు కించపరచలేరు.
4. చిరిగినా చొక్కా ఐయినా తొడుక్కో  కానీ
   మంచి పుస్తకం కొనుక్కొ.
5.ఒక సంవత్సరము హాయిగా బ్రతకాలంటే ధాన్యం పెంచు ,
   పదేళ్ళు హాయిగా బ్రతకాలంటే పళ్ళ చెట్లు పెంచు,
  జీవితకాలం హాయిగా ఉండాలంటే మనుషుల్ని పెంచు.
6. ఇంతవరకు లేనివి కావాలంటే ,ఇంతవరకు చేయని పని చేయాలి.
7.విజయము అంటే చేయగలిగినప్పుడల్లా,చేయగలిగినంత చేయగలిగిన
  వారికీ మంచి  చేస్తూ పోవడం.
8.నీ కెంత విజయం కావాలో అంత నమ్మకం ఉండాలి.
9. మారందే ఎదగలేవు ఎదగందే అభిరుధ్ధి లేదు.
10. గెలుపు అంటేనే రాజీలేని పోరాటం
     పోరాడే వారిదే గెలుపు
    పోరాటానికి,ఓటమికి,ఇతరుల మాటలకి
    భయపడి రాజీపడే వాడు గెలవలేడు.
    గెలిచేవాడికి ఈ మాటలు వినపడవు.
    ఏ కష్టాలు అడ్డుపడవు
    రాజీలేని బ్రతుకు కోరుకునే వారు
    పోరాటము లో రాజీని కోరరు.
11.గెలిస్తే మహా అయితే ప్రపంచానికి పరిచయమవుతావు.
     ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది.
12.భయం అనే వరదను అధిగమించాలంటే
     ధైర్యము అనే ఆనకట్టను నిర్మించాలి.
13.చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణము.

  



No comments:

Post a Comment